Palwancha: పాల్వంచలో యువకుడు అదృశ్యం ఆందోళనలో కుటుంబ సభ్యులు!
Palwancha: పాల్వంచలో శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన చిలుముల మహేష్ (30) అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ తెలిస్తే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగలరు.
Palwancha: పాల్వంచలో యువకుడు అదృశ్యం ఆందోళనలో కుటుంబ సభ్యులు!
Palwancha: పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. శివాలయం ప్రక్క వీధికి చెందిన చిలుముల మహేష్ (30) ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 5 అడుగుల ఎత్తు, చామన ఛాయతో ఉంటాడు. ఇంటి నుండి వెళ్లే సమయంలో బ్లూ కలర్ గీతలు ఉన్న తెల్ల టీ-షర్ట్, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.
బంధువులు, స్నేహితుల ఇళ్లలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ యువకుడి ఆచూకీ తెలిసిన వారు 8790114028 సెల్ నంబర్ కు గానీ, సమీపంలోని పాల్వంచ పోలీస్ స్టేషన్ కు గానీ సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.




