Palvancha: పాల్వంచలో ఉత్సాహంగా 100వ ఫిట్ ఇండియా సైక్లింగ్

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 100వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 29 Nov 2026 4:03 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచలో ఉత్సాహంగా 100వ ఫిట్ ఇండియా సైక్లింగ్

పాల్వంచ టౌన్: యువతలో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం పాల్వంచలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో డీఏవీ పాఠశాల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సైక్లింగ్‌తో సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి మేరా యువ భారత్ అకౌంట్స్ ఆఫీసర్ భాను చందర్, డీఏవీ పాఠశాల ప్రిన్సిపాల్ శాజీ, పీఈటీ శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామం ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువత రోజువారీ జీవితంలో సైక్లింగ్, యోగా, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా వ్యాయామం దోహదపడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం సైక్లింగ్, యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న యువతకు ధ్రువపత్రాలు అందజేశారు. మేరా యువ భారత్ వాలంటీర్లు సాయి వంశీ, రాంపండు, భద్రాద్రి యువసేన అధ్యక్షుడు వెంకట్ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN