Palvancha: పాత పాల్వంచ ఆలయంలో తులసీదామోదర కళ్యాణ మహోత్సవం
Palvancha: పాత పాల్వంచ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసీదామోదర కళ్యాణం; పూజల్లో పాల్గొన్న వందలాది భక్తులు, కొత్వాల దంపతులకు సన్మానం.
Palvancha: పాత పాల్వంచ ఆలయంలో తులసీదామోదర కళ్యాణ మహోత్సవం
పాల్వంచ: పాత పాల్వంచలో పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి తులసీదామోదర కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయం పూజారి కందాల సింహాద్రి ఆనందకుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజారులు తులసీదామోదర కళ్యాణం జరిపించారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కార్తీకమాసంలో నిర్వహించే ఈ పూజలు ఎంతో పవిత్రమైనవి.
ఈ సందర్భంగా దేవాలయంలో కార్యనిర్వహణాధికారి ధరణిప్రగడ విజయలక్ష్మి సమక్షంలో జరిగిన ప్రత్యేక పూజల్లో వందలాది మంది మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవిలు పాల్గొని పూజలు చేశారు.
కొత్వాల దంపతులను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్వాల విమలాదేవి దంపతులను కార్యక్రమ నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈ.వో ధరణిప్రగడ విజయలక్ష్మి, విజయ గోపాల్ దంపతులు, కిలారి సుజాత, మహిళా భక్తులు పాల్గొన్నారు.




