Palvancha: అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

Palvancha: తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మృతిచెందిన భద్రాద్రి జిల్లా అధ్యక్షులు అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 15 Nov 2026 4:29 PM IST
Palvancha
X

Palvancha: అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

పాల్వంచ: పాల్వంచ, నవంబర్ 15 తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం అధ్యక్షులుగా సేవలందించిన స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రాష్ట్ర సంఘం తరఫున రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ మేరకు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ కుమార్తె అనంతుల మధులికకు రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తన సభ్యుల సంక్షేమానికి, ఆపద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ సంఘానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ఉద్యోగులు విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ ఆవేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సమస్యలను సంఘం దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే సంఘం ఆధ్వర్యంలోని న్యాయ సహాయ కమిటీ ద్వారా న్యాయపరమైన సలహాలు, సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలె బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రామ్మోహన్, పిట్ట ఉమాదేవి, రాష్ట్ర కోశాధికారి రాపోలు సోమేశ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీయూఎస్ ప్రధాన కార్యదర్శి దూలం నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN