Palvancha: స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో స్పేస్ ప్లానిటోరియం షో
Palvancha: పాల్వంచ స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో స్పేస్ గెలాక్సీ అండ్ ప్లానిటోరియం షో నిర్వహించి, విద్యార్థులకు అంతరిక్ష విశేషాలపై అవగాహన కల్పించారు.
Palvancha: స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో స్పేస్ ప్లానిటోరియం షో
పాల్వంచ: పాల్వంచలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో మంగళవారం స్పేస్ గెలాక్సీ అండ్ ప్లానిటోరియం షోను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు అంతరిక్ష విశేషాలను ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకున్నారు. సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఆస్టరాయిడ్స్‌తో పాటు గ్రహాల కదలికలు, సౌర వ్యవస్థ పనితీరును ఆసక్తిగా వీక్షించారు.
అంతేకాకుండా ప్రాచీన కాలంలో డైనోసార్ల ఆవిర్భావం, వాటి జీవన విధానం, భూమిపై జీవ పరిణామ క్రమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించిన ఈ వినూత్న ప్రదర్శన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధనా ఆసక్తిని పెంపొందించింది.
అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రోగ్రాం ఆర్గనైజింగ్ ఇన్‌చార్జి సోమా కిరణ్ కుమార్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




