Palvancha: లక్ష్మీనారాయణ బలవన్మరణంపై సమగ్ర విచారణ
Palvancha: పాల్వంచ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ బలవన్మరణంపై సమగ్ర విచారణ జరపాలని పద్మశాలి సంఘం, కుటుంబ సభ్యుల వినతి. బాధ్యులను వదలమని ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టం.
Palvancha: లక్ష్మీనారాయణ బలవన్మరణంపై సమగ్ర విచారణ
పాల్వంచ: భద్రాచలంలోని గోదావరి లాడ్జిలో పాల్వంచ హెచ్.పి. గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పద్మశాలి సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుమార్తె తన తండ్రి మృతికి కారణమైన పరిస్థితులపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కన్నీటి పర్యంతమవుతూ ఎస్పీని కోరారు. పద్మశాలి సంఘం నాయకులు సైతం నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాధ్యులను వదిలేది లేదు: ఎస్పీ
వినతిపై స్పందించిన ఎస్పీ రోహిత్ రాజ్.. కేసును క్షుణ్ణంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధ్యులుగా తేలిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు వై.ఎస్. రావు, గుండు రవికుమార్, వేముల ప్రసాద్ బాబు, వేముల సతీష్, వేముల మధుకర్, ఇమంది ఉదయ్ కుమార్, పుట్టా శంకరయ్య, తోటకూర శ్రీనివాసరావు, పిండిపోలు కన్నయ్య, దోమల కిషోర్, బొమ్మ రామకిషోర్, దోమల ప్రవీణ్, పెగడ శంకర్, ఆడెపు నాగరాజు, రాగిణి వెంకటేశ్వర్లు, వేల శివ, వేల జీవన్ తదితరులు పాల్గొన్నారు.




