Palvancha: లక్ష్మీనారాయణ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలి పద్మశాలి సంఘం

Palvancha: పాల్వంచలో హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ మృతిపై నిష్పక్షపాత విచారణ డిమాండ్. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పద్మశాలి సంఘం కొవ్వొత్తుల ర్యాలీ.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 23 Oct 2026 10:20 PM IST
Palvancha
X

Palvancha: లక్ష్మీనారాయణ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలి పద్మశాలి సంఘం

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నటరాజ్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు లక్ష్మీనారాయణ మృతికి సంబంధించిన వాస్తవాలను విచారణ ద్వారా వెలికితీయాలని కోరారు. ఈ ఘటనలో ఎవరైనా బాధ్యులుగా తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పద్మశాలి సమాజం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని సంఘం నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్రగుంట సాంబశివరావు, గుండు రవికుమార్, ఆడపు రమాకాంత్, దోమల కిషోర్, గుగ్గిళ్ల రామ్మూర్తి, పిండిపోలు కన్నయ్య, మణుపురి ప్రభాకర్, ఇబ్బంది ఉదయ్, బొమ్మ రామకిషోర్, మహేష్, రాపోలు రమేష్, గుండు సిద్ధార్థ, వంకా సతీష్, శివ సాంబమూర్తి, వెలదండి ఆనంద్, సామల వెంకటేశ్వర్లు, శంకర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN