Palvancha: భార్య పుట్టింట్లో ఉంటోందని మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం కాలనీలో బానోత్ రాము (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Updated on: 6 Nov 2026 11:46 PM IST
Palvancha
X

Palvancha: భార్య పుట్టింట్లో ఉంటోందని మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం!

పాల్వంచ, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగరం కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బానోత్ రాము (35) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాము భార్య శైలజ (28) గత పది నెలలుగా పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాము మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

రాముకు ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరికి ఎనిమిదేళ్లు, మరొకరికి ఐదేళ్లు. కుటుంబానికి ఏకైక కుమారుడైన రాము మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారులు తండ్రిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN