Palvancha: పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మండల పూజా మహోత్సవాలు
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు జెండా ఆరోహణతో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
Palvancha: పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మండల పూజా మహోత్సవాలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు జెండా ఆరోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
దేవస్థాన పూజారి మాధవన్ నంబూద్రి, బృందావనం నరసింహమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, ఉషపూజ, మూలధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి బైండింగ్ వర్క్స్ అండ్ పేపర్ మార్ట్ యజమాని చావా కిషోర్ ఆధ్వర్యంలో జెండా ఆరోహణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దేవాలయ చైర్మన్, శ్రీ స్వామి అయ్యప్ప వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు, పాల్వంచ కోఆపరేటివ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండల పూజా మహోత్సవాల ప్రారంభంతో దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు కాల్వ భాస్కర్ రావు, కనగాల రాంబాబు, మేడిద సంతోష్ గౌడ్, బి. శ్రీనివాస్‌తో పాటు దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




