Palvancha: పాల్వంచ మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష

Palvancha: పాల్వంచ మండల సర్వసభ్య సమావేశంలో గ్రామాల అభివృద్ధి పనులపై సమీక్ష. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో రాజారావు సూచన.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 22 Oct 2026 9:47 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచ మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష

పాల్వంచ: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ జి. శ్రీనివాస్, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ శ్రీలాల్ సింగ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశానికి మండలంలోని 22 మంది గ్రామపంచాయతీ సర్పంచులు, వివిధ శాఖలకు చెందిన 21 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.

గ్రామపంచాయతీ సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు వాటిపై వివరాలు అందించారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో పి. రాజారావు తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN