Palvancha: పాల్వంచ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Palvancha: పాల్వంచ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారి కె. సుభాష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి; ముద్రలు లేని కాటాలు సీజ్ చేసి 12 కేసులు నమోదు చేశారు.
Palvancha: పాల్వంచ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
పాల్వంచ: పట్టణంలోని మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారి కె. సుభాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో వినియోగిస్తున్న కాటాలు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లను అధికారులు పరిశీలించారు.
చికెన్, మటన్, చేపలు, కూరగాయలు, కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి తూనికలు, కొలతల పరికరాల పనితీరును పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ముద్రలు లేని కాటాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత వ్యాపారులపై చర్యలు చేపట్టారు. తనిఖీల్లో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న కాటాలు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు కాటాలు, వేయింగ్ మెషీన్లను తప్పనిసరిగా ధృవీకరించించుకుని వినియోగించాలని అధికారులు సూచించారు. తూనికల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
వినియోగదారులు కూడా తాము కొనుగోలు చేసే వస్తువుల తూనికలను పరిశీలించాలని, అనుమానం ఉంటే తూనికలు, కొలతల శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మార్కెట్‌లో తూనికలు, కొలతల విషయంలో నిబంధనలు పాటించేలా తనిఖీలు కొనసాగిస్తామని అధికారి కె. సుభాష్ తెలిపారు.




