Palvancha: పాల్వంచ ఐడీఓసీలో ఘనంగా ఏడోరోజు బతుకమ్మ వేడుకలు

Palvancha: పాల్వంచ ఐడీఓసీ ప్రాంగణంలో ఏడోరోజు వేపకాయల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ పూజలు చేసి ప్రారంభించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 16 Oct 2026 9:50 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచ ఐడీఓసీలో ఘనంగా ఏడోరోజు బతుకమ్మ వేడుకలు

పాల్వంచ: ఐడీఓసీ కార్యాలయంలో డీ. ఏం.హెచ్.ఓ,డీ. సీ.హెచ్.ఎస్,జీ.జీ.హెచ్.ఎస్,డీ. ఈ.ఓ,డీ. ఐ. ఈ.ఓ,డీ.డీ ట్రైబల్ వెల్ఫేర్,డీ. వై.ఎస్.ఓ ల ఆధ్వర్యాలలో ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను శుక్రవారం వేడుకగా నిర్వహించగా డీ. ఏం. హెచ్.ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీ. ఏం. హెచ్.ఓ మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో వేడుకలాగా అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మకు గుర్తింపు లభించిందని తెలిపారు.

ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను..ఐక్యతను ఈ వేడుకలు వేదికగా నిలిచాయన్నారు.ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పిందన్నారు.

ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు వివిధ రకాల పువ్వులతో అందంగా బతుకమ్మలను పేర్చి,అలంకరించి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలను పాడుతూ, ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డీ. ఏం.హెచ్.ఓ ,డీ. సీ.హెచ్.ఎస్,జీ.జీ.హెచ్.ఎస్,డీ. ఈ.ఓ,డీ. ఐ. ఈ.ఓ,డీ.డీ ట్రైబల్ వెల్ఫేర్,డీ. వై.ఎస్.ఓ శాఖల అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN