Palvancha: ఆర్టిజన్ టీవోవో విడుదల చేయాలి TG-GENCO డైరెక్టర్‌కు వినతి
Palvancha: పాల్వంచ KTPSలో ఆర్టిజన్ ఒప్పందాల టీవోవో వెంటనే విడుదల చేయాలని TG-GENCO డైరెక్టర్ HR కుమార్ రాజుకు H-82 నాయకులు వినతిపత్రం అందజేశారు.
పాల్వంచ: KTPS కాంప్లెక్స్‌కు శనివారం విచ్చేసిన TG-GENCO డైరెక్టర్ HR కుమార్ రాజును H-82 నాయకులు కలిసి ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. గత సెప్టెంబర్ 23న ఉద్యోగ, ఆర్టిజన్ జేఏసీలతో యాజమాన్యం జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన T.O.O. (టెక్నికల్ ఆర్డర్)ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ HR కుమార్ రాజు స్పందిస్తూ, చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్లే T.O.O. విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఆర్డర్ విడుదల చేస్తామని, జేఏసీలతో యాజమాన్యం జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టిజన్ కార్మికులకు మంచి రోజులు రానున్నాయని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, అపోహలు నమ్మవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో H-82 నాయకులు ఆవుల కృష్ణారెడ్డి, వెంపటి అనిల్ కుమార్, మహమ్మద్ మసూద్, ఉండేటి జయరాజు, మహేశ్వరం శ్రీనివాసులు, కేసరి రవీందర్, పోల్కంపల్లి సాంబశివ, దుర్గాప్రసాద్, ఎస్.కె. సమీఉల్లా, జానీ పాషా, భూక్య వీరన్న, రాంబాబు, విష్ణు, గుమ్మడి రాంబాబు, రాంబాయి, ఫరీదా, సుబ్బారావు, చెరుకు శ్రీను తదితరులు పాల్గొన్నారు.




