Palvancha: నోటిఫికేషన్ వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు: కొత్వాల!
Palvancha: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు నోటిఫికేషన్ వరకు అవకాశముందని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ తహశీల్దార్ దారా ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
Palvancha: నోటిఫికేషన్ వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు: కొత్వాల!
పాల్వంచ, నవంబర్ 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీ అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పాల్వంచ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దారా ప్రసాద్ తో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించి, తన ఓటర్ దరఖాస్తును అందజేశారు.
దరఖాస్తు పరిశీలనకు గెజిటెడ్ సంతకం ప్రామాణికం కాదని, నవంబర్ 1, 2023 లోపు గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. పాల్వంచలో గత ఎన్నికల్లో 4,576 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 6,641 మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ వజ్జ లలిత, కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం, కొండం వెంకన్నగౌడ్, పైడిపల్లి మహేష్, నందా నాయక్ తదితరులు పాల్గొన్నారు.




