Palvancha: మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా పెద్దమ్మ గుడికి రూ.లక్ష విరాళం!
Palvancha: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడికి రూ.లక్ష విరాళం ప్రకటించిన కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు.
Palvancha: మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా పెద్దమ్మ గుడికి రూ.లక్ష విరాళం!
Palvancha: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో వేంచేసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి) కి రూ. లక్ష విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎస్.రావు మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను, పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, మండల అధ్యక్షులు భువన సుందర్ రెడ్డి, జాలే జానకిరెడ్డి, జగన్నాథపురం సర్పంచ్ బానోత్ అనిత, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు దుప్పలపూడి సురేష్, ధర్మసత్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.




