Palwancha: 4.5 లక్షల కొత్త పింఛన్ల మంజూరుపై పాల్వంచలో కాంగ్రెస్ సంబరాలు!

Palwancha: రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసిన సందర్భంగా పాల్వంచ మండల, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 Nov 2026 7:56 PM IST
Palwancha
X

Palwancha: 4.5 లక్షల కొత్త పింఛన్ల మంజూరుపై పాల్వంచలో కాంగ్రెస్ సంబరాలు!

పాల్వంచ: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్వంచ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మాట్లాడుతూ, సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత మరియు గీత కార్మికుల కుటుంబాలకు ఈ పింఛన్లు ఎంతో తోడ్పాటుగా నిలుస్తాయని తెలిపారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగిరెడ్డి భువనసుందర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ భాస్కర రావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు సాదం రామకృష్ణ, పెంకి శ్రీనివాస రావు, చింతా నాగరాజు, నల్లమల సత్యం, వాసమల్ల సుందర రావు, జొన్నాడ కృష్ణ, కటుకూరి శేఖర్, బిల్లా సుజిత్, లోగాని మురళి, పాపారావు, అర్జున్, జోషి, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు దస్తగిరి, రఫీ, చాంద్ సాబ్, వేమా రాంబాబు, గంగుల నరేందర్ రెడ్డి, జలసూత్రం భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN