Palvancha: పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు, పోక్సో చట్టంపై అవగాహన

Palvancha: పాల్వంచ మండలం నర్సింహసాగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మాదకద్రవ్యాలు, పోక్సో చట్టం, సురక్షిత్ బచ్పన్ అభియాన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 19 Nov 2026 10:14 PM IST
Palvancha
X

Palvancha: పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు, పోక్సో చట్టంపై అవగాహన

పాల్వంచ: విద్యార్థి దశలో క్రమశిక్షణతో కూడిన అలవాట్లు అలవర్చుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని జిల్లా పారా లీగల్ వాలంటీర్ (PLV) వజ్జా శ్రీనివాస్ సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పాల్వంచ మండలం ఉల్వనూరు–లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింహసాగర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలు, పోక్సో చట్టం గురించి వివరించారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ, మంచి అలవాట్లు, సమయపాలన, చదువు ప్రాధాన్యతను తెలియజేశారు.

అలాగే పిల్లల హక్కులు, వారి సంరక్షణ, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి అవగాహన కల్పించారు. పిల్లలపై ఎలాంటి వేధింపులు, అఘాయిత్యాలు జరిగినా వెంటనే స్పందించి 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి చైల్డ్ వెల్ఫేర్ విభాగానికి సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల రక్షణ కోసం అమలు చేస్తున్న సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమం గురించి కూడా వివరించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN