Palair: పాలేరు నియోజకవర్గంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
Palair: ఖమ్మం సాయి గణేష్ నగర్ కందాళ క్యాంప్ కార్యాలయంలో దీక్షా దివస్ ఘనంగా జరిగింది. కందాళ ఉపేందర్ రెడ్డి, తాత మధుసూదన్ ఉద్యమకారులను సన్మానించారు.
Palair: పాలేరు నియోజకవర్గంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
పాలేరు: ఖమ్మం సాయి గణేష్ నగర్ కందాళ క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పాల్గొన్ని పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారులను సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో చారిత్రాత్మక మలుపని పేర్కొన్నారు.దివస్ కేవలం ఒక వేడుక కాదు తెలంగాణ పోరాట స్ఫూర్తి ఉద్యమకారుల త్యాగాలు,అమరవీరుల బలిదానాలు అన్నారు.




