Palwancha: లక్ష్మీనారాయణ మృతి పద్మశాలీ సంఘానికి తీరని లోటు!
Palwancha: పద్మశాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ మృతిపై దిగ్భ్రాంతి. భౌతికకాయానికి నివాళులర్పించిన రాష్ట్ర నేతలు ఈగ వెంకటేశ్వర్లు, బాలకృష్ణ!
Palwancha: లక్ష్మీనారాయణ మృతి పద్మశాలీ సంఘానికి తీరని లోటు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ మృతి పట్ల తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆలే బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఆదివారం పాల్వంచలో నిర్వహించిన అంత్యక్రియల్లో వారు పాల్గొని భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలీ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణ అకాల మరణం పద్మశాలీ ఉద్యోగుల సంఘానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మానసిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై విచారణ జరిపి దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు.




