Burgampahad: బూర్గంపాడులో చేయూత పింఛన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం!
Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Burgampahad: బూర్గంపాడులో చేయూత పింఛన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం!
కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగుల చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై సంబంధిత అధికారుల వ్యవహారశైలి పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కనీసం మీడియాకు తెలియజేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, పింఛన్ల పంపిణీ వంటి కీలక కార్యక్రమంపై మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియాను పక్కనపెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ కార్యక్రమాల పారదర్శకతపై అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం?
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, మీడియాకు సమాచారం ఇవ్వని అధికారుల తీరుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో మీడియాను విస్మరించడం అధికారుల నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టడమా?




