Sathupally: క్యాన్సర్ బాధిత చిన్నారికి NRI చల్లగుళ్ల నిఖిల్ ఆర్థిక సాయం!
Sathupally: సత్తుపల్లిలో బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి ఛార్లెస్ ఫిన్నీకి అమెరికా NRI చల్లగుళ్ల నిఖిల్ ఆర్థిక సాయం. రూ.10,000 అందజేసి మానవత్వం చాటుకున్న నిఖిల్.
Sathupally: క్యాన్సర్ బాధిత చిన్నారికి NRI చల్లగుళ్ల నిఖిల్ ఆర్థిక సాయం!
Sathupally: సత్తుపల్లికి చెందిన చిన్నారి ఛార్లెస్ ఫిన్నీ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావు గారి కుమారుడు చల్లగుళ్ల నిఖిల్ గారు, వెంటనే స్పందించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. సత్తుపల్లి చిన్నారి పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించడం నిఖిల్ గారి మానవత్వానికి నిదర్శనం.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత అందించడం నిజమైన మానవత్వానికి ప్రతీక. అవసరమైన సమయంలో అందించే ప్రతి సహాయం బాధిత కుటుంబానికి ఎంతో విలువైనదే.
నిఖిల్ గారు చేసిన ఈ మానవతా సహాయం మరికొందరికి స్ఫూర్తిగా నిలిచి, చిన్నారి వైద్యానికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చేలా చేయాలి.
దూరం ఎంత ఉన్నామానవత్వంతో స్పందించే మనసుకు హద్దులు ఉండవు. చల్లగుళ్ల నిఖిల్ గారి మానవతా స్పందనకు అభినందనలు. చిన్నారి ఛార్లెస్ ఫిన్నీ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం.




