Burgampahad: చెరువు సింగారంలో ఎమ్మెల్యే అధికారిక పర్యటనకు స్వాగత ఏర్పాట్లు కరువు!!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారంలో ఎమ్మెల్యే పర్యటనకు అధికారుల కనీస ఏర్పాట్లు కరువు. ప్రోటోకాల్ నిర్లక్ష్యంపై విమర్శల వర్షం.

RAVI, BURGAMPAD AREA
Published on: 7 Nov 2026 11:05 AM IST
Burgampahad
X

Burgampahad: చెరువు సింగారంలో ఎమ్మెల్యే అధికారిక పర్యటనకు స్వాగత ఏర్పాట్లు కరువు!!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామంలో ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమం ఉన్నప్పటికీ, గ్రామంలో కనీసం స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రజాప్రతినిధి పర్యటనపై అధికారులకు ముందస్తు సమాచారం లేదా? లేక ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం వహించారా?

అధికారిక కార్యక్రమంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఎమ్మెల్యే పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారా లేదా అన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA