Bhadrachalam: తాలిపేరు ప్రాజెక్టు నీరు తాగునీటికే: వేసంగి వరి సాగుకు అనుమతి లేదు!
Bhadrachalam: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భద్రాచలం తాలిపేరు ప్రాజెక్టు నీటిని తాగునీటికే వాడుకోవాలని, వేసంగి వరి సాగుకు నీరు ఇవ్వొద్దని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
Bhadrachalam: తాలిపేరు ప్రాజెక్టు నీరు తాగునీటికే: వేసంగి వరి సాగుకు అనుమతి లేదు!
Bhadrachalam: ఈరోజు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, తాలిపేరు ఆయకట్టు పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేసంగి వరి పంట సాగు చేయడం కుదరదని సూచించారు.
తాలిపేరు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, కరువు పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
కరువు పరిస్థితుల దృష్ట్యా పశువులను కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా పశుగ్రాసం, సజ్జలు, జనుములు తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు చేయాలని కోరారు.
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వేసంగి వరి పంటకు నీటిని విడుదల చేయకుండా, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే వ్యవసాయ శాఖ అధికారులు వేసంగి వరి సాగుకు సంబంధించిన విత్తనాలను ప్రభుత్వ తరఫున సరఫరా చేయకుండా చూడాలని, ప్రైవేటు విత్తన కంపెనీలు కూడా ఈ సంవత్సరం వేసంగి వరి విత్తనాలను సరఫరా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, నీటి లభ్యతను బట్టి వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.




