Bhadradri: రూ.30 లక్షల నూతన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం!
Bhadradri: అశ్వాపురం మండలం తుర్రంవారిగూడెం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు.
Bhadradri: రూ.30 లక్షల నూతన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం!
Bhadradri: అశ్వాపురం మండలం తుర్రంవారిగూడెం గ్రామంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతోందన్నారు. నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో తుర్రంవారిగూడెం గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తన వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల అధ్యక్షులు ఓరుగంటి రమేష్ బాబు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




