Ashwaraopeta: నూతన సెటిల్ కోర్టు ప్రారంభం..ఎమ్మెల్యేల ఘన ప్రారంభోత్సవం!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా నిర్మించిన సెటిల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, మట్టా రాగమయి.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 7 Oct 2026 3:38 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: నూతన సెటిల్ కోర్టు ప్రారంభం..ఎమ్మెల్యేల ఘన ప్రారంభోత్సవం!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాల చెరువు రోడ్డులో డాక్టర్ బాబురావు గారి స్థలంలో నూతనంగా నిర్మించిన సెటిల్ కోర్టును అశ్వారావుపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జారె ఆదినారాయణ గారు, సత్తుపల్లి శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి మట్టా రాగమయి గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సెటిల్ కోర్టును ప్రారంభించిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యేలు అభినందించారు. యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులు కావడానికి, శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇటువంటి క్రీడా వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతులను పెంపొందించాల్సిన అవసరం ఉందని, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి క్రీడలు మంచి వేదికగా నిలుస్తాయని వారు అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, యువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

సెట్టిల్ కోర్టు నిర్మాణానికి స్థలం సమకూర్చిన డాక్టర్ బాబురావు గారిని ఈ సందర్భంగా అభినందించారు. స్థానికంగా క్రీడలను ప్రోత్సహించేందుకు వ్యక్తిగతంగా ముందుకు వచ్చి వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్ గారు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, డాక్టర్ బాబురావు గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA