Khammam: డిసెంబర్ 1న నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన!

Khammam: నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 1న ఖమ్మంలోని చెరుకూరి వారి మామిడి తోటలో వన సమారాధన నిర్వహిస్తున్నట్లు యలమందల జగదీష్ తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 24 Nov 2026 7:38 PM IST
Khammam
X

Khammam: డిసెంబర్ 1న నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన!

ఖమ్మం: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 1న ఖమ్మం లోని చెరుకూరి వారి మామిడి తోటలో వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ తెలిపారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళ వారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యలమందల జగదీష్ మాట్లాడుతూ... ఈ వనమ హోత్సవ వేడుకల్లో జిల్లాలోని నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తిదారులు, కుల కుటుంబ సభ్యులు, అన్ని మండలాలు, గ్రామాల్లోని నాయీ బ్రాహ్మణ కుటుంబాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ కలయికతో స్నేహాలను, బంధుత్వాలను పంచుకుందామన్నారు. తమ ఐక్యత ను తెలియజేద్దామన్నారు. ఈ వన సమారాధననను ఒక మహా యజ్ఞంలా గా తీసుకుని నాయీ బ్రాహ్మణ ఉద్యోగ యూనియన్లు, ఖమ్మం నగర నాయీ బ్రాహ్మణ పాలక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వన భోజనాల ద్వారా స్నేహాలను, బంధుత్వాలను, బంధాలను కలుపుకుందామని పిలుపునిచ్చారు.

ఈ విలేకరుల సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం నాయకులు జిడుగు వెంకట రామకృష్ణ, దేవరకొండ సైదులు, రంగారావు , గౌరవ అధ్యక్షులు నంద్యాల రాము, సురభి సైదులు, జిల్లా నాయకులు నంద్యాల నరసింహ రావు, రావులపాటి శ్రీను, గౌరవ సలహాదారులు దోమకొండ నాగేశ్వరరావు, శ్రీ గాద శ్రీనివాసరావు, సూత్రాల శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపతి రామనాథం, శ్రీరాముల సైదులు, కొలిపాక రాఘవేంద్రరావు, కోశాధికారి అద్దంకి పాపారావు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి నరేష్, ప్రచార కార్యదర్శి చిట్యాల సైదులు, సహాయ కార్యదర్శి సురభి సందీప్, ఈసీ మెంబర్లు శ్రీ రాముల నాగేశ్వరరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు గరిడేపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.