Khammam: లాభాల బాటలో నాగులవంచ పీఏసీఎస్ ఏఎంసీ చైర్మన్ అంబటి ప్రశంస!

Khammam: నాగులవంచ సొసైటీలో 3 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నల కొనుగోలులో పాలకవర్గ కృషి అభినందనీయమని ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Oct 2026 7:14 AM IST
Khammam
X

Khammam: లాభాల బాటలో నాగులవంచ పీఏసీఎస్ ఏఎంసీ చైర్మన్ అంబటి ప్రశంస!

Khammam: మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో నాగులవంచ సొసైటీ పాలకవర్గం కృషిని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అభినందించారు. బుధవారం నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) జనరల్ బాడీ సమావేశం సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘానికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులతో పాటు రైతులతో చర్చించారు. నాగులవంచ సహకార సంఘం పరిధిలో రైతు సోదరులను సమన్వయం చేసుకుంటూ 3 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను చేయడంలో పాలకవర్గం కృషిని మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అభినందించారు.

రైతులకు సహకార సంఘం ద్వారా అందుతున్న సేవలను మరింత విస్తరించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. సొసైటీ లో రుణ గ్రహీత 60 సంత్సరాల లోపు జరిగే సహజ మరణానికి, 70 సంత్సరాల లోపు జరిగే ప్రమాద మరణానికి నామినికి లక్ష రూపాయలు భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

మరో రెండు రోజుల్లో మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగుతుందన్నారు. ఈ సందర్భంగా సొసైటీ CEO యాలమూడి శ్రీనివసరావు సంఘం జమ, ఖర్చులు పాలక మండలి ముందు ఉంచారు. సంఘం లాభాల బాటలో నడుస్తున్నట్లు వివరించారు. ఈ మహాజన సమావేశంలో సంఘ పాలకవర్గ సభ్యులు ఆళ్ల శ్రీనివాసరావు ,

మద్దినేని పరిమిత, పరచగాని లక్ష్మణ్ , బోర్రా లక్ష్మీనారాయణ , సామినేని అప్పారావు , నారపోగు వెంకటేశ్వర్లు , యల్లంపల్లి నాగేశ్వరావు సంఘ సభ్యులతో పాటు నాగులవంచ ఉప సర్పంచ్ అంబటి శరత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, సిబ్బంది పడిశాల కెనడి రావు, దేశబోయిన మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.