Kothagudem: ఢిల్లీ సభలో పాల్గొని కీలక నేతలను కలిసిన నాగాసీతారాములు యాదవ్
Kothagudem: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి సభలో పాల్గొన్న కొత్తగూడెం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగాసీతారాములు యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలను కలిశారు.
Kothagudem: ఢిల్లీ సభలో పాల్గొని కీలక నేతలను కలిసిన నాగాసీతారాములు యాదవ్
కొత్తగూడెం: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగాసీతారాములు యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సభకు హాజరయ్యారు.
సభ అనంతరం సోమవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ నేత గిడుగు రుద్రరాజు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చైర్మన్ మధుయాష్కి గౌడ్‌లను నాగాసీతారాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన పోరాటంలో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ వేదికగా కూటమి అగ్రనేతలు ప్రజాస్వామ్య పరిరక్షణపై ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.




