Mulakalapalli: మురుసు తుపాను బీభత్సం పోగళ్లపల్లిలో నీటమునిగిన పంటలు

Mulakalapalli: మురుసు తుపాను ధాటికి పోగళ్లపల్లి పరిధిలో నీటమునిగిన వరి, శనగ పంటలు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన సర్పంచ్ మడకం రవి.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 5 Nov 2026 4:37 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: మురుసు తుపాను బీభత్సం పోగళ్లపల్లిలో నీటమునిగిన పంటలు

ములకలపల్లి: మురుసు తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ములకలపల్లి మండలం పోగళ్లపల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు రహదారులు దెబ్బతిన్నాయి.

ప్రధానంగా పోగళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వరి, శనగ తదితర పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో ఈ విపత్తు సంభవించడంతో తాము పెట్టిన పెట్టుబడులు సైతం దక్కేలా లేవని స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు.

పంట పొలాలను పరిశీలించిన సర్పంచ్: వర్షాల దాటికి పంట నష్టపోయిన ప్రాంతాలను గ్రామ పంచాయతీ సర్పంచ్ మడకం రవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో గ్రామ పంచాయతీ తరఫున రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నష్ట వివరాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర సర్వే చేయిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN