Aswaraopeta: ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ!
Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకస్మిక తనిఖీ చేసి, నిర్లక్ష్యం వీడాలని అధికారులను హెచ్చరించారు.
Aswaraopeta: ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ!
అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు.
ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. పరిష్కరించదగిన సమస్యలను సైతం పెండింగ్‌లో ఉంచడం సరికాదని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా భావించి అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు
ఇదే మొదటి చివరి అవకాశంగా భావించాలి
అధికారులు సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో పనిచేయాలని ఈ హెచ్చరికను మొదటి మరియు చివరి అవకాశంగా గుర్తుంచుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పేర్కొన్నారు.




