Mulakalapally: ములకలపల్లిలో ఉగ్రరూపంలో మూకమామిడి వాగు!
Mulakalapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో 231.8 మి.మీ రికార్డు వర్షపాతం నమోదు కావడంతో మూకమామిడి వాగు ఉగ్రరూపం దాల్చింది.
Mulakalapally: ములకలపల్లిలో ఉగ్రరూపంలో మూకమామిడి వాగు!
Mulakalapally: ములకలపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బుధవారం ఉదయం నాటికి మండలంలో అత్యధికంగా 231.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా మూకమామిడి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అలుగు పారుతుండగా, గ్రామ పరిధిలోని చెరువు పొంగి పలు ఇళ్లు నీటితో చుట్టుముట్టబడ్డాయి.
మూకమామిడి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మొగరలగుప్ప–మూకమామిడి గ్రామాల మధ్య ఉన్న వంతెన తెగిపోయింది. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో వాగు ప్రవాహంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని రెస్క్యూ బృందం చాకచక్యంగా బయటకు తీసి సురక్షితంగా కాపాడింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకల సమీపానికి వెళ్లవద్దని సర్పంచి కోర్సా ఆదిలక్ష్మి సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పంచాయతీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయక చర్యల్లో సత్వరమే స్పందించిన స్థానిక ఎస్సై మధు ప్రసాద్, తహసీల్దార్ స్వాతి బిందు, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.




