Mudigonda: సొసైటీ చైర్మన్ చొరవతో రైతు ఖాతాల్లో జమైన గన్నీ సంచుల డబ్బులు!
Mudigonda: ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి చొరవతో మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి రైతుల ఖాతాల్లో గన్నీ సంచుల డబ్బులు జమ చేయించారు.
Mudigonda: సొసైటీ చైర్మన్ చొరవతో రైతు ఖాతాల్లో జమైన గన్నీ సంచుల డబ్బులు!
Mudigonda: ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి కృషితో గన్నీ సంచుల డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న, వరిని కొనుగోలు చేయగా వాటికి సంబంధించిన గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండగా రైతులు ఆందోళన నేప థ్యంలో సొసైటీ చైర్మన్ చొరవతీసుకొని మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చేయడంతో 4070మంది రైతులకు గాను దాదాపు 5,46,560 గన్నీ సంచులు సరఫరా చేయగా వారికి డబ్బులు జమయ్యాయి.
రావనుకున్న డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్ యలగొండస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి అమ్మిన గన్నీసంచికి రూ.20.54చ చొప్పున యలగొండస్వామి ద్వారా లబ్ది చేకూరడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




