Bhadrachalam: దళిత కాలనీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి ఎమ్మార్పీఎస్!
Bhadrachalam: దళిత కాలనీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీని కోరిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు.
Bhadrachalam: దళిత కాలనీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి ఎమ్మార్పీఎస్!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 29- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో దళిత కాలనీ లల్లో నాన్యమైన వైద్య సేవలు అందించాలి.వైద్యం అందక దళితులు అనేకమంది మృత్యువాత పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అధిక శాతం దళిత కుటుంబాలకు సంబంధించిన వారే ఎక్కువగా రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. కావున నూతనంగా ఎన్నిక కాబడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ దళిత కాలనీలలో మెడికల్ క్యాంపులు, రక్తదాన కార్యక్రమాలు, కంటి ఆపరేషన్లు, రక్తహీనత బాధితుల దళిత కుటుంబాలకు పూర్తి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
చదువుకున్న ప్రతిభ కలిగిన యువతి యువకులైన దివ్యాంగులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో అర్హతను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపి వారికి రక్షణగా ఉండాలని ఆశిస్తున్నాము గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం తరఫున ఎమ్మార్పీఎస్, ఎంఎస్సీ,మహాజన మహిళ మండలి MMM,మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSF, వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS, మాదిగ మహిళ సమైక్య MMS, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరుపున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షల పోటీ తత్వంతో ఏర్పడ్డ మీ యొక్క నూతన కమిటీ ఎటువంటి విభేదాలు లేకుండా ప్రజా సేవలో మమైక్యమై ఐక్యతతో అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిమనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తు సామాజిక ఉద్యమ, మహిళా మండలి మేకల లత కోరారు.




