Palvancha: పాల్వంచ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ!

Palvancha: కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రజలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత మండపాలను సందర్శించి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 19 Oct 2026 6:54 AM IST
Palvancha
X

Palvancha: పాల్వంచ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం రాత్రి పాల్వంచలోని పలు దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆడబిడ్డలతో కలిసి కోలాటం ఆడారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన భాష, యాస నిరాధరణకు గురయ్యాయన్నారు. మహానేత కేసీఆర్ నాయకత్వాన స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, యాసలకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అపహాస్యానికి గురైన మన యాసను ఇప్పుడు సినిమా వాళ్లు బాగా ఉపయోగించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN