Khammam: ఎంపీ రఘురాం రెడ్డి చొరవతో పల్లెల అభివృద్ధికి రూ.4.36 కోట్లు!

Khammam: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చొరవతో వీబీ–జీ రామ్‌ జీ పథకం కింద రూ.4.36 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 17 Nov 2026 7:44 AM IST
Khammam
X

Khammam: ఎంపీ రఘురాం రెడ్డి చొరవతో పల్లెల అభివృద్ధికి రూ.4.36 కోట్లు!

Khammam: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో ముందడుగు పడింది. వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవికా మిషన్‌ (వీబీ–జీ రామ్‌ జీ) పథకం కింద రూ.4.36 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చొరవతో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 37 అభివృద్ధి పనులకు ఈ నిధులు కేటాయించారు.

ఇవీ చేపట్టనున్న పనులు..

మంజూరైన నిధుల్లో రూ.2.60 కోట్లతో 13 గ్రామ పంచాయతీ భవనాలు, రూ.36 లక్షలతో మూడు అంగన్ వాడీ భవనాలు నిర్మించనున్నారు. మరో రూ.1.40 కోట్లతో గ్రామ పంచాయతీలు, పాఠశాలలకు సంబంధించి 21 ప్రహరీల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లో పాలనాపరమైన వసతులు మెరుగుపడటంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి.

ఎంపీకి సర్పంచుల కృతజ్ఞతలు

రూ.4.36 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిని కలిసి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.