Bayyaram: కోతుల దాడితో నష్టపోయిన రైతును ఆదుకోవాలి.. వ్యవసాయ కార్మిక సంఘం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కోతుల దాడితో మిరప, పత్తి పంటలు ధ్వంసమై రైతు తీవ్రంగా నష్టపోగా, ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
Bayyaram: కోతుల దాడితో నష్టపోయిన రైతును ఆదుకోవాలి.. వ్యవసాయ కార్మిక సంఘం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన రైతు గుండ్లపెల్లి వీరన్న ఎకరం మిరప తోట, ఎకరం పత్తి చేను అందులో కోతులు పడి తోట నాశనం చేస్తున్నాయని విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలుసుకొని,తోట దగ్గర వెళ్లి తోటలు పరిశీలించి సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వీరన్న రైతు మిరప తోట, పత్తి తోటలకు పంటల కోసం వడ్డీలకు తెచ్చి సుమారు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు.
పంట చేతికొచ్చే సమయానికి కోతులు దాడి చేసి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. మిరప కాయలను తెంపి పడేస్తున్నాయి, పత్తి చేనును కూడా నాశనం చేస్తున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదేమోనని రైతు వీరన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తనలా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
కోతుల వల్ల పంటలు మాత్రమే కాదు, ఇండ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వంట సామాన్లు, బియ్యం, కూరగాయలు కూడా ఎత్తుకెళ్తున్నాయని వాపోతున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాను రాను వ్యవసాయం చేసే పరిస్థితే ఉండదని, పంటలు వేసే రైతే ఉండడని, చివరకు గ్రామాలు వదిలి వలస వెళ్లి సిటీలో పని చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని సంఘ నాయకులు అంటున్నారు, సంబంధించిన అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు...
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు గడ్డిపాటి రాజా రావు, మండల కమిటీ సభ్యులు బొబ్బ ఉపేందర్ రెడ్డి, గుండేటి వీరభద్రం, గిరిజన సంఘం నాయకులు కవి బాబు, రైతు సహదేవ్, తదితరులు పాల్గొన్నారు.




