Khammam: ఖమ్మం జీజీహెచ్‌లో అత్యాధునిక బయో మెడికల్ వేస్ట్ రూమ్స్

Khammam: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక బయో మెడికల్ వేస్ట్ స్టోరేజ్ రూమ్స్‌ను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. నరేందర్ ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 8:04 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం జీజీహెచ్‌లో అత్యాధునిక బయో మెడికల్ వేస్ట్ రూమ్స్

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా, పరిశుభ్రంగా మరియు పర్యావరణహితంగా నిర్వహించేందుకు బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ ప్రమాణాలు, నమూనాల ప్రకారం అత్యాధునిక బయో మెడికల్ వేస్ట్ స్టోరేజ్ రూమ్స్‌ను నిర్మించడం జరిగింది.

ఈ నూతన భవనాన్ని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. నరేందర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ గారు, నర్సింగ్ ఆఫీసర్లు మరియు పారిశుద్ధ్య విభాగపు సూపర్వైజర్ల సమక్షంలో ప్రారంభించారు.

ఈ స్టోరేజ్ రూమ్స్‌లో బయో మెడికల్ వ్యర్థాలు మరియు సాధారణ వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వేర్వేరుగా సేకరించి నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పసుపు, ఎరుపు, నీలం, తెలుపు రంగుల విభాగాల ద్వారా వివిధ రకాల వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేయడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు బయో మెడికల్ వేస్ట్ మరియు జనరల్ వేస్ట్ మధ్య ఉన్న వ్యత్యాసాలు, వాటిని వేర్వేరుగా సేకరించడం, సరైన రంగుల కంటైనర్లలో వేయడం, వ్యర్థాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఆసుపత్రి పరిశుభ్రత, రోగుల భద్రత, వైద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ ఎంతో కీలకమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లు, పారిశుద్ధ్య విభాగపు సూపర్వైజర్లు, శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్