Kothagudem: వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌.. భారత క్రికెట్‌కు గర్వకారణం: పాయం!

Kothagudem: భారత్-A తరఫున యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం అభినందించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 24 Nov 2026 9:10 PM IST
Kothagudem
X

Kothagudem: వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌.. భారత క్రికెట్‌కు గర్వకారణం: పాయం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భారత్-A జట్టు తరఫున ఈరోజు UAEతో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభ కనబరిచి 53 బంతుల్లో 204 పరుగులు సాధించడం పట్ల పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.

కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు సాధించడంతో పాటు 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడని కొనియాడారు. యువ వయసులోనే ఇలాంటి అసాధారణ ప్రతిభ కనబరచడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి భారత క్రికెట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA