Burgampahad: జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే పాయం కొండంత అండ
Burgampahad: జర్నలిస్టు క్రాంతి కుమార్ తల్లి దాసరి రేణుకను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Burgampahad: జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే పాయం కొండంత అండ
Burgampahad: కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ప్రజాప్రతినిధి అండగా నిలిస్తే కొండంత ధైర్యం కలుగుతుంది. ఈ తరహాలోనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మానవీయ స్పందన కనబరిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు క్రాంతి కుమార్ దాసరి తల్లి దాసరి రేణుకను సోమవారం ఆయన పరామర్శించారు. బూర్గంపాడు మండలం గౌతాపురంలోని ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రేణుకకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడంతో పాటు వైద్య చికిత్సలకు సహకరిస్తానని హామీ ఇవ్వడం కుటుంబ సభ్యులకు కొంత ఊరటనిచ్చింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు భజన ప్రసాద్, బూర్గంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ మంద నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులపల్లి సుధాకర్, యువజన నాయకులు ఎడమకంటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కైపు రోసిరెడ్డి, బూర్గంపాడు మండల నాయకులు, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, దాసరి సాంబ, వారాల వేణు, బూర్గంపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




