Manuguru: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం!

Manuguru: మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంతాపం వ్యక్తం చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 4 Nov 2026 12:45 PM IST
Manuguru
X

Manuguru: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం!

Manuguru: మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ పాయం వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.

ప్రవళిక మృతి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA