Gundala: సాయనపల్లిలో రూ. 3.30 కోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ!
Gundala: గుండాల మండలం సాయనపల్లిలో రూ. 3.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం భూమిపూజ చేశారు.
Gundala: సాయనపల్లిలో రూ. 3.30 కోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ!
గుండాల: గుండాల మండలం సాయనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి వ్యవసాయ రంగానికి, గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ, డీఈ, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




