Sathupally: పెనుబల్లిలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Sathupally: సత్తుపల్లి మండలం పెనుబల్లిలో అర్హులైన పేదలకు చేయూత కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 14 Nov 2026 3:13 PM IST
Sathupally
X

Sathupally: పెనుబల్లిలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Sathupally: అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శుక్రవారం పెనుబల్లి మండల కేంద్రంలోని వంగా సీతారామయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా అర్హులైన పేదలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులు పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు. పెనుబల్లి మండలంలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్ వంటి పథకాలతో అండగా నిలుస్తోందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI