Kothagudem: సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే!
Kothagudem: కొత్తగూడెం, పాల్వంచ పరిధిలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
Kothagudem: సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే!
Kothagudem: బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రకృతితో మమేకమై జరుపుకునే ఈ పూల పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పట్టణ పరిధిలోని వివిధ బస్తీలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీబీ నగర్, పాత కొత్తగూడెం, విద్యానగర్, శ్రీనగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లను సందర్శించి సామూహిక నిమజ్జనోత్సవాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో జరుపుకునే వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తెస్తాయన్నారు. ఇలాంటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




