Palvancha: అంబేద్కర్ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కూనంనేని!
Palvancha: పాల్వంచ లక్ష్మీదేవిపల్లిలో అంబేద్కర్ భవన అదనపు బ్లాకుల నిర్మాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేసి పనులను పరిశీలించారు.
Palvancha: అంబేద్కర్ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కూనంనేని!
పాల్వంచ: సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ భవన్ ను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసమే సంక్షేమ భవనాలు, సామాజిక భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
పాల్వంచ మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి (ఎస్) గ్రామ పంచాయతీలో అంబేద్కర్ భవనానికి అదనపు బ్లాకుల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ, కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాళ్లు, సామాజిక భవనాలను మంజూరు చేయించి అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, సభలకు ఈ భవనాలు ఉపయోగపడతాయన్నారు. నిధులను ప్రజా అవసరాలకే వినియోగిస్తున్నామని, నిర్మాణ పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సర్పంచ్ భూక్యా మంజుల, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




