Palvancha: బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కూనంనేని
Palvancha: పాల్వంచలో బలవన్మరణానికి పాల్పడిన హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్యే కూనంనేని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Palvancha: బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ: హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భరోసా ఇచ్చారు. ఇటీవల భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే.. కేసు దర్యాప్తు పురోగతి, నిందితులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. విచారణను వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి కుటుంబానికి అందాల్సిన సహాయ సహకారాలు, సంక్షేమ ప్రయోజనాలు త్వరితగతిన అందేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథ్, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేటర్ అడుసుమల్లి సాయిబాబా, గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరఫున గుండు రవికుమార్, ఇమ్మంది ఉదయ్, పిండిపోలు కన్నయ్య, బొమ్మ రామకిషోర్, మాచర్ల శీను, వేముల ప్రసాద్, వేముల సతీష్, బోయిన విజయ్, వేముల మనోహర్ రావు, రాపోలు రమేష్ తదితరులు హాజరయ్యారు.




