Kothagudem: పివికే-5 గనిలో శరన్నవరాత్రి వేడుకలు ఎమ్మెల్యే కూనంనేని హాజరు!

Kothagudem: పివికే-5 గనిలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Nov 2026 8:45 AM IST
Kothagudem
X

Kothagudem: పివికే-5 గనిలో శరన్నవరాత్రి వేడుకలు ఎమ్మెల్యే కూనంనేని హాజరు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పివికే-5 గనిలో శనివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గని పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు.

ఈ సందర్భంగా గని కార్మికులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలు, గని పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ ఆత్మీయంగా గడిపారు. అనంతరం గని మేనేజర్, ఏజెంట్ కలిసి ఎమ్మెల్యే కూనంనేనిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, యూనియన్ నాయకులు, గని అధికారులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంతో నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM