Mulakalapalli: 516 మందికి చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Mulakalapalli: ములకలపల్లి మండలంలో 516 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు హక్కు పత్రాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పంపిణీ చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 18 Nov 2026 8:17 AM IST
Mulakalapalli
X

Mulakalapalli: 516 మందికి చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Mulakalapalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో 516 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు హక్కు పత్రాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ హక్కు పత్రాలు అందజేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెన్షన్లు మంజూరు కావడంతో తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏళ్ల తరబడి ఎదురుచూసిన తర్వాత పెన్షన్ మంజూరు పత్రాలు చేతికి అందడంతో కొందరు లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, రోజువారీ ఖర్చులు, అనారోగ్య సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం అందించే పెన్షన్ తమలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల సమస్యలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఓపికగా వింటూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోదిలి జ్యోతి, జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, కారం సుధీర్, సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN