Bhadrachalam: భద్రాచలంలో ప్రముఖ సంఘ సేవకుడు గాదె మాధవ రెడ్డి పరామర్శించిన ఎమ్మెల్యే!

Bhadrachalam: భద్రాచలంలో గుండె శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ సంఘ సేవకుడు గాదె మాధవ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Sept 2026 3:08 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో ప్రముఖ సంఘ సేవకుడు గాదె మాధవ రెడ్డి పరామర్శించిన ఎమ్మెల్యే!

Bhadrachalam: భద్రాచలం వెంకటేశ్వర కాలనీ మొదటి వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ సంఘ సేవకులు పట్టణ ప్రముఖులు గాదె మాధవ రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా మాధవ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకునే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

పరిపూర్ణమైన ఆరోగ్యం తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని చేయటానికి ఆ భగవంతుడు పూర్తిగా అనుగ్రహించాలని అప్పటివరకు తగిన విశ్రాంతి తీసుకుని టైం కు మందులు వేసుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, యూత్ నాయకులు గాడి విజయ్ మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem