Sathupalli: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

Sathupalli: సత్తుపల్లి పట్టణం, మండలంలోని 63 మంది లబ్ధిదారులకు రూ.63.07 లక్షల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 10 Nov 2026 9:42 PM IST
Sathupalli
X

Sathupalli: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు అందజేశారు.

సత్తుపల్లి పట్టణం: 27 మంది లబ్ధిదారులకు రూ.27,03,132 విలువైన చెక్కులు.

సత్తుపల్లి మండలం: 36 మంది లబ్ధిదారులకు రూ.36,04,176 విలువైన చెక్కులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ఆవశ్యకతను వివరించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మహిళలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నూతన సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు గారు, మున్సిపల్ చైర్మన్ రిహన్ కమల్ పాషా గారు, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI