Hyderabad: ప్రపంచ నూతన దిశానిర్దేశానికి భారత్ సమ్మిట్ వేదిక.. ఎమ్మెల్యే!
Hyderabad: హైదరాబాద్ హైటెక్స్ సిటీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ సమ్మిట్ – 2026కు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హాజరయ్యారు.
Hyderabad: ప్రపంచ నూతన దిశానిర్దేశానికి భారత్ సమ్మిట్ వేదిక.. ఎమ్మెల్యే!
Hyderabad: హైటెక్స్ సిటీ, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి భారత్ సమ్మిట్ – 2026 (BHARAT SUMMIT – FORGING A NEW WORLD) కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యురాలు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా రాగమయి హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, శాంతి, మానవ హక్కులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమ్మిట్ ఒక గొప్ప అంతర్జాతీయ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.
సుమారు 70 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు, మేధావులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నూతన ప్రపంచ నిర్మాణానికి అవసరమైన ఆలోచనలు, విధానాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు (AI), యువతకు అవకాశాలు, మహిళా సాధికారత, అంతర్జాతీయ శాంతి, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై జరుగుతున్న చర్చలు భవిష్యత్ ప్రపంచానికి ఎంతో దోహదపడతాయని డాక్టర్ మట్టా రాగమయి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజాస్వామ్య, ప్రగతిశీల ఆలోచనలతో సమానత్వం, శాంతి, అభివృద్ధి దిశగా నూతన ప్రపంచ నిర్మాణానికి భారత్ సమ్మిట్ మార్గదర్శకంగా నిలుస్తుందని ఆమె ఆకాంక్షించారు.




